‘ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్’ ఇండియా లేటెస్ట్ కలెక్షన్స్ !

Published on Apr 29, 2019 8:10 pm IST

ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ క్రేజ్ ఉన్న ఎవెంజర్స్ సిరీస్ నుండి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎవెంజర్స్ – ది ఎండ్ గేమ్’ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తోంది. కాగా ఈ చిత్రం ఇండియాలో మొదటి మూడు రోజుల్లో మొత్తం 187 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తెలుగులో కూడా ఈ చిత్రానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది.

కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు రోజులకు 1.2 బిలియన్లను ఇండియన్ కరెన్సీలో 8400 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్లు ఈ సినిమాలోని డైలాగ్స్ లో అక్కడక్కడా తెలుగు సినిమాల పేర్లను, తెలుగు సినిమాల్లోని డైలాగ్ లను వాడారు. దాంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను బాగానే ఆదరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :