ప్రపంచ సినీ రికార్డులన్నీ.. ఇక బద్దలే !

Published on Apr 25, 2019 4:00 am IST

ప్రపంచ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ఎట్టకేలకూ సినిమా ప్రపంచంలోనే కనివిని ఎరగని విధంగా అత్యధిక థియేటర్లలో విడుదలవ్వడానికి సిద్ధం కాబోతోంది. అయితే ‘ఎవెంజ‌ర్స్’ ఎండ్ గేమ్ కు ఉన్న క్రేజ్ చూస్తే.. మ‌రో ఏ సినిమాకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రేక్ష‌కుల నుంచి విశేషమై స్పంద‌న లభిస్తోంది. అమెరికాలో అయితే ప్రస్తుతం ‘ఎవెంజర్స్’ టికెట్ సంపాదించడం అసాధ్యం అన్న రేంజ్ లో చెప్పుకుంటున్నారు.

అమెరికాలో ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నా.. కొన్ని ఏరియాల్లో ఏకంగా 100 షోస్ లు వేస్తోన్న.. క్షణాల్లో టికెట్లు సేల్ అయిపోతున్నాయట. శుక్ర శని అదివారాల్లో ఇప్పటికే ‘సౌల్డ్ ఔట్’ అని బోర్డు పడిపోయిందట. యూఏస్ లో తొలి వారాంతానికి టికెట్లు బుక్ చేయడం చాలా కష్టంగా ఉందని.. అమెరికా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోందని తెలుస్తోంది.

దీని బట్టి ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించే చిత్రంగా ప్రపంచ సినీ రికార్డులన్నీ బద్దలుకొట్టి.. కొత్త రికార్డ్స్ ను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి మూడు రోజులకు ఒక్క అమెరికాలోనే 300 మిలియన్ల మార్క్ ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 300 మిలియన్లు అంటే దాదాపు మన దేశ కరెన్సీలో సుమారు 2100 కోట్లు. ఓన్లీ అమెరికాలోనే ఇన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తే.. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చెయ్యాలి. మొత్తానికి ‘ఎవెంజర్స్’ సిరీస్ లో చివరిగా వస్తోన్న ‘ది ఎండ్ గేమ్’ ఇచ్చే ఫినిషింగ్ టచ్ అదిరిపోయేలానే ఉంది.

సంబంధిత సమాచారం :