పీక్స్‌కి చేరిన అవినాష్ ఓవర్ కామెడీ..!

Published on Jul 14, 2021 1:51 am IST

తెలుగు బుల్లితెర‌పై ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించే షోల‌లో స్టార్ మాలో వస్తున్న “కామెడీ స్టార్స్” కూడా ఈ మధ్య కామెడీ ఆస్వాదించే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా దీనికి సంబంధించి ఒక ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఇందులో అవినాష్ చేసిన ఓవర్ కామెడీ కాస్త ఓవర్‌గా ఉన్నప్పటికీ హిలేరియస్‌గా అనిపించింది.

అయితే కంటికి కనిపించని అవినాష్ కొడుక్కి యాదమ రాజు కేర్ టేకర్‌గా ఉండనున్నాడట. కొడుకు లేకున్నా అవినాష్ ఇచ్చిన ఓవర్ బిల్డప్‌కి యాదమ రాజు ఇచ్చిన అమాయకపు ఎక్స్‌ప్రెషన్స్ నవ్వులు పూయించేలా అనిపించాయి. అయితే ఈ ఓవర్ కామెడీ ఎపిసోడ్‌ను మిస్ కాకుండా చూడాలంటే మాత్రం ఈ ఆదివారం 1:30 గంటలకు స్టార్ మాలో వచ్చే “కామెడీ స్టార్స్”ని చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :