హర్షవర్ధన్ రాణే, పూర్ణ జంటగా విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన చిత్రం ‘అవును’. 2012లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘అవును 2’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొండాపూర్ ఏరియాలో జరుగుతోంది. అక్కడ హీరో, హీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఇటీవలే పూర్ణ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. రెండు షెడ్యూల్స్ లో ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసుకుంది. ఈ మూవీలో సంజన ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఫ్లయింగ్ ఫ్రాగ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చాలా లో బడ్జెట్ తో తెరకెక్కిన అవును సినిమా నిర్మాతలకి మంచి లాభాన్ని తెచ్చి పెట్టాయి. ఆఅ సినిమా లానే ఈ సినిమా కూడా హిట్ అయ్యి మంచి లాభాలను తెచ్చి పెతుతుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం భావిస్తోంది.


