“ఆచార్య” నుంచి అవైటెడ్ సాంగ్ అప్పుడేనట.!

Published on May 23, 2021 6:00 pm IST

మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో “ఆచార్య” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి పలు ఆసక్తికర వార్తలనే లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అందించారు. అయితే ఈ చిత్రం నుంచి మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మ్యూజిక్ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పటికే మణిశర్మ అందించిన ఫస్ట్ సింగిల్ మంచి చార్ట్ బస్టర్ కావడంతో సెకండ్ సింగిల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేసారు. చరణ్ మరియు పూజా హెగ్డే ల మధ్య ప్లాన్ చేసిన బ్యూటిఫుల్ డ్యూయెట్ ను ఈ కోవిడ్ పరిస్థితులు చెక్కబడిన వెంటనే విడుదల చెయ్యనున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మోస్ట్ అవైటెడ్ సాంగ్ ని ఇంకో నెల రోజుల్లో ఆశించొచ్చు. దీని కోసం అయితే ఎప్పటినుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :