అవైటెడ్ “ఫ్యామిలీ మ్యాన్ 2” రిలీజ్ కాస్త ముందేనా.?

Published on Jun 3, 2021 1:00 pm IST

ప్రస్తుతం ఇండియన్ వైడ్ ఓటిటి వీక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2”. సీజన్ 1 భారీ హిట్ కావడంతో సీజన్ 2 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. అయితే ఎట్టకేలకు ఈ సిరీస్ విడుదలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సోషల్ మీడియాలో మేకర్స్ నుంచి పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా నెటిజన్స్ మాత్రం బాగానే హైప్ తెస్తున్నారు.

మరి వారందరికీ ఈ సిరీస్ ట్రీట్ కాస్త ఎర్లీగా ఉంటుందేమో అన్న టాక్ కూడా వినిపిస్తుంది. మాములుగా అయితే ఈ మూడో తారీఖు అర్ధ రాత్రి 12 గంటలకు సిరీస్ లాంచ్ ఉంది. కానీ ఇది వరకు అలా చెప్పినా డైరెక్ట్ సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 10 గంటల నుంచే అందుబాటులోకి వచ్చాయి.

దీనితో ఈ క్రమంలో ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత నుంచి ఏ సమయంలో అయినా ఈ మోస్ట్ అవైటెడ్ సిరీస్ అందుబాటులోకి రావచ్చని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అలాగే మరోపక్క సమంతా నెగిటివ్ రోల్ మరియు మనోజ్ భాజ్ పై ఇంటెన్స్ పెర్ఫామెన్స్ లు కోసం ప్రతి ఒకరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ సిరీస్ ట్రీట్ కాస్త ముందే వస్తుందా లేక 12 గంటల నుంచే ఉంటుందా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :