అవైటెడ్ “లవ్ స్టోరీ” అప్పటికి షిఫ్ట్ అయ్యిందా.?

Published on Jun 8, 2021 12:00 pm IST

అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “లవ్ స్టోరీ”. ప్రతి అంశంలోని మంచి ముందు జాగ్రత్తతో ప్లాన్ చేసిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల్లో కూడా విజయవంతంగా షూట్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే గత ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ మూలాన ఆగిపోయింది.

అప్పటికే భారీ అంచనాలు సాలిడ్ ఓపెనింగ్స్ కన్ఫర్మ్ అనుకున్న ఈ చిత్రం టాలీవుడ్ లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మరి అక్కడ నుంచి మే నెలకి షిఫ్ట్ కాబడిన ఈ చిత్రం అప్పుడు కూడా విడుదల పరిస్థితులు లేకపోయే సరికి మళ్ళీ రిలీజ్ ఎపుడో దానిపై మౌనంగానే ఉంది.

అయితే ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రం ఆగస్ట్ రేస్ కి షిఫ్ట్ అయ్యినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అన్ని పనులు ముగించేసుకున్న ఈ చిత్రం ఆగష్టు నాటికి పరిస్థితులు మరింత మెరుగవుతాయని అప్పటికి మార్చుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :