“RRR” ని ఎలా అయినా అప్పటికి తీస్కురావాలని చూస్తున్నారా?

“RRR” ని ఎలా అయినా అప్పటికి తీస్కురావాలని చూస్తున్నారా?

Published on Aug 31, 2021 9:01 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలతో రెడీగా ఉన్న చిత్రాల్లో రౌద్రం రణం రుధిరం కూడా ఒకటి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. ఇటీవల షూట్ అంతటిని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది రిలీజ్ లేనట్టే కన్ఫర్మ్ అయ్యింది.

మరి కొత్త రిలీజ్ డేట్ సమయం ఎప్పుడు అన్నది ఆసక్తికరంగా మారగా ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ ప్రకారం అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో నిలపాలని చూస్తున్నారట. దీనితో సంక్రాంతికి రెండు పాన్ ఇండియన్ సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయని చెప్పాలి. మరి దీనిపై కన్ఫర్మేషన్ వస్తే అప్పుడుకి ఏ సినిమాలు రేస్ లో నిలుస్తాయో ఏవి వాయిదా పడతాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు