విజయ్ అవైటెడ్ ఫస్ట్ లుక్ కి డేట్ అండ్ టైం ఫిక్స్డ్.!

Published on Jun 18, 2021 11:00 am IST

ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ హీరోగా ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.. అలాగే ఈ చిత్రంలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది. మరి ఇదిలా ఉండగా విజయ్ కొత్త సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుంది అంటే అది నమోదు చేసే ఇంపాక్ట్ నే సోషల్ మీడియాలో వేరే స్థాయిలో ఉంటుంది.

మరి ఇప్పుడు మరోమారు సోషల్ మీడియాను స్టన్ చెయ్యడానికి విజయ్ సిద్ధం అయ్యిపోయాడు. తాను నటిస్తున్న 65వ చిత్రం తాలూకా మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కు డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యిపోయాయి. మరి ఈ జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా వస్తుంది అనుకున్నా అంతకు ముందు రోజే ఈ ట్రీట్ రావడం కన్ఫర్మ్ అయ్యింది.

మరి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జూన్ 21న సాయంత్రం 6 గంటలకే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ రివీల్ చెయ్యనున్నట్టుగా ఈ చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసేసారు. మరి ఫస్ట్ పోస్టర్స్ లో విజయ్ కు భారీ రికార్డులే ఉన్నాయి మరి ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :