ఈ అవైటెడ్ ఇండియన్ వెబ్ సిరీస్ వచ్చేది అప్పుడేనా.?

Published on May 5, 2021 9:00 am IST

గత ఏడాది నుంచి మన దేశంలో కూడా డిజిటల్ ప్లాట్ ఫామ్ వినియోగం ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే. అలా మన దగ్గర తీసే కంటెంట్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లకు కూడా మంచి ఆదరణ మరియు రీచ్ వచ్చింది. అలా మన దేశానికి చెందిన పలు వెబ్ సిరీస్ లలో అత్యధికంగా జనం ఎదురు చూస్తున్న క్రేజీ సీక్వెల్ సిరీస్ ఒకటి ఉంది అదే “ది ఫ్యామిలీ మ్యాన్ 2”.

మనోజ్ భాజ్ పాయ్ మెయిన్ లీడ్ లో నటించిన ఈ వెబ్ సిరీస్ మోస్ట్ లవ్డ్ ఇండియన్ సిరీస్ లలో ఒకటి. అయితే ఈ సీక్వెల్ గత ఫిబ్రవరిలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేయాల్సి ఉండగా కాస్తా వాయిదా పడింది. స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని నెగిటివ్ షేడ్ ల నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందో అన్న దానిపై లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది.

ఓటిటి నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మేకర్స్ ఈ సిరీస్ ను వచ్చే జూన్ మొదటి వారంలో విడుదల చేసే యోచనలో ఉన్నారట. ఇది వరకే అప్పుడు ఫిబ్రవరిలో మిస్ చేసినందున దర్శకులు రాజ్ అండ్ కృష్ణ డీకే లు సమ్మర్ లో తీసుకొస్తాం అని చెప్పారు. మరి అది జూన్ కి ఫిక్స్ అయ్యినట్టు ఉందని చెప్పాలి. మరి అప్పుడైనా ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :