అవైటెడ్ “ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ అప్పుడే.!

Published on May 15, 2021 11:20 am IST

ప్రస్తుతం మన ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది “ది ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ అనే చెప్పాలి. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ ప్యూర్ ఇండియన్ థ్రిల్లర్ సీజన్ 1 సూపర్ హిట్ కావడంతో అంత సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సిరీస్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా మంచి బజ్ వినిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ సీజన్ ట్రైలర్ కు ముహూర్తం కుదిరినట్టు తెలుస్తుంది. ఈ సీజన్ ను మేకర్స్ వచ్చే వారంలో విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. అయితే ఇంకా డేట్ తెలియరాలేదు కానీ వచ్చే వారంలో కన్ఫర్మ్ అన్నట్టు తెలుస్తుంది.

ఈసారి సీజన్లో స్టార్ హీరోయిన్ సమంతా విలన్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మనోజ్ భాజ్ పై మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. వీటితో పాటుగా ఈ సిరీస్ వచ్చే జూన్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రావడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :