‘అ !’ ను ఆకాశానికెత్తేస్తున్న సెలబ్రిటీలు !

15th, February 2018 - 08:30:10 AM

హీరో నాని నిర్మాతగా వ్యవహరిస్తూ తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన మొదటి చిత్రం ‘అ !’. నూతన దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. ముందు నుండి మంచి పాజిటివ్ బజ్ కలిగిఉన్న ఈ సినిమా నిన్న ప్రదర్శించిన ప్రైవేట్ స్క్రీనింగ్ ద్వారా సెలబ్రిటీల నుండి అద్భుతమైన ఫీడ్ బ్యాక్ అందుకుంది.

నానికి సన్నిహితులు, మిత్రులు నిన్న ఈ సినిమాను వీక్షించి సినిమా చాలా బాగా వచ్చిందని, ప్రశాంత్ వర్మ నిజంగా మర్చిపోలేని సినిమా తీశారని, ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ గొప్పగా ఉందని చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. మరి సినీ జనాల్ని ఇంతలా మెప్పించిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.