‘పక్కా కమర్షియల్ సినిమా’తో వస్తున్న అయోధ్య కుమార్.

‘పక్కా కమర్షియల్ సినిమా’తో వస్తున్న అయోధ్య కుమార్.

Published on Jun 29, 2014 6:00 PM IST

comersial
తోలి సినిమా ‘మిణుగురులు’తో విమర్శకుల ప్రసంశలు అందుకున్న దర్శకుడు అయోధ్య కుమార్… ‘మిణుగురులు’ సినిమా విమర్శకుల ప్రసంశలను అందుకోవడమే కాదు… ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ ఎన్నో అవార్డులను అందుకుంది. హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలలో గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డును, బెంగళూరులో జరిగిన 9వ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. మరిన్ని అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.

ప్రయోగాత్మక సినిమా ‘మిణుగురులు’తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న అయోధ్య కుమార్… తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ ‘పక్కా కమర్షియల్ సినిమా’.. మీరు కోరుకున్నట్టే అనేది కాప్షన్. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అంటూ అప్పుడే చర్చ ప్రారంభమయ్యింది. పోస్టర్ తో కావాల్సినంత క్రేజ్ కొట్టేసిన అయోధ్య కుమార్… సినిమాతో మరోసారి విజయం సాదించాలని ఆశిద్దాం.

తాజా వార్తలు