
పవన్ సిద్ధు, కామ్నా సింగ్, నిషిత ప్రధాన పాత్రల్లో నటించగా అన్ని క్రియేషన్స్ పతాకంపై గంటా రామకృష్ణ నిర్మించిన సినిమా ‘అయ్యో రామా’. కిరణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సంతోష్ కవల్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను ఈ సాయంత్రం హైద్రాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ వేడుకకు దర్శక, నిర్మాతలతో పాటు మిగతా యూనిట్ మొత్తం విచ్చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత గంటా రామకృష్ణ మాట్లాడుతూ.. అయ్యో రామా అంటూ పేరులోనే మంచి ఫన్‌ను నింపుకున్న ఈ సినిమాలో కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. సంతోష్ కవల అందించిన మ్యూజిక్ శ్రోతలను బాగా ఆకట్టుకుంటుందన్న నమ్మకాన్ని నిర్మాత ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఇక దర్శకుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. అందరినీ ఆకట్టుకునే మంచి కథాంశంతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. ఇక ఈ సినిమాకు రాజేష్ కుమార్ కథ, మాటలు అందించగా, పవన్ విజయ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.

