‘బీటెక్ బాబులు’ పోస్టర్ లాంచ్

‘బీటెక్ బాబులు’ పోస్టర్ లాంచ్

Published on Jul 31, 2015 9:05 AM IST

btech-babuli
ఫ్రెండ్స్ ఫిల్మీ పతాకంపై గుడ్ ఫ్రెండ్స్ నిర్మాణంలో రూపొందిన సినిమా ‘బీటెక్ బాబులు’. శర్య, రోషిణి, అశ్విని, వైజాగ్ శంకర్, నోవల్ కిషోర్, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శీను ఇమ్మడి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇక ఈ ఉదయం బీటెక్ బాబులు సినిమాకు సంబంధించిన పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైద్రాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పీ.పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పోస్టర్ లాంచ్ సందర్భంగా దర్శకుడు శీను మాట్లాడుతూ.. “నలుగురు ఇంజనీరింగ్ చదిచే కుర్రాళ్ళ కథే ఈ సినిమా. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో వాళ్ళ ప్రవర్తన, ఆలోచనా విధానం ఎలా ఉంది? ఆ తర్వాత వాళ్ళ ఆలోచనా విధానం, ప్రవర్తనలో వచ్చిన మార్పు ఎలా ఉంది? అన్న నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది” అని తెలిపారు. ఇక ఆర్.పి.పట్నాయక్ మాట్లాడుతూ.. దర్శకుడు శీను ఆలోచనల్లో లోతైన భావం కనిపిస్తుందని, తప్పకుండా మంచి సినిమా తీసి ఉంటాడని కోరుకుంటున్నానని తెలిపారు. ఆగష్టు నెలలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు