‘బాహుబలి’ ప్రీ రిలీజ్ ప్రసార హక్కులు ఎంతకు అమ్ముడయ్యాయో తెలుసా !


బాహుబలి – ది కంక్లూజన్ చిత్రం యొక్క ప్రీరిలీజ్ వేడుక ఈరోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. సినిమాకున్న ప్రచారం, అది సాధించిన, సాదించబోతున్న ఘన విజయం కారణంగా ప్రేక్షకుల్లో సినిమాపై చాలా ఆసక్తి ఉంది. ఇటీవల రిలీజైన ట్రైలర్ కూడా కళ్ళు చెదిరే రీతిలో ఉండటంతో చిత్రానికి సంబందించిన ప్రతి ఈవెంట్ హైలైట్ గా నిలుస్తోంది. సాయంత్రం ప్రత్యక్ష ప్రసారం కానున్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం సినీ అభిమానులంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

ప్రేక్షకుల్లో ఉన్న ఈ క్రేజ్ ను గమనించిన తెలుగు న్యూస్ ఛానెల్స్ టీవీ9, ఎన్టీవీలు సుమారు రూ. 75 లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కుల్ని దక్కించుకున్నాయట. ఇది కూడా బాహుబలి ఖాతాలో ఒక రికార్డ్ అనే చెప్పాలి. ప్రత్యేక కెమెరా ఏక్యూప్మెంట్ తో 360 డిగ్రీల కోణంలో ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ వేడుక ప్రసారంతో తమ చానెళ్ల టీఆర్ఫీ రేటింగ్స్ బాగా పెరిగే అవకాముంది కనుక ఛానెల్స్ ఇంత పెద్ద మొత్తం ఆఫర్ వెచ్చించాయి. ఈ ఈవెంట్ కు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు కరణ్ జొహార్, ఇతర సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.