
ఈ ఏడాది టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసి త్వరలో ఇంటర్నేషనల్ రిలీజ్ కి సిద్దమవుతున్న సినిమా ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ బాక్స్ ఆఫీసు వద్ద సౌత్ ఇండియన్ నెంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.? అది తెలియాలంటే బాహుబలి 2 వరకూ ఆగాల్సిందే..
బాహుబలి 2 సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలు కానుందని ఇది వరకే తెలియజేశాం. తాజాగా ఈ సినిమా రిలీజ్ కి సంబందించిన ఓ ఆసక్తికర విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మొదట రాజమౌళి సినిమా రిలీజ్ అవ్వగానే సెకండ్ పార్ట్ షూట్ మొదలెట్టేసి వచ్చే ఏడాది జూలైకల్లా సినిమాని రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ సెప్టెంబర్ నుంచి అనుకున్న షూటింగ్ డిసెంబర్ కి వెళ్ళడం వలన సినిమా రిలీజ్ కూడా కాస్త వెనక్కి వెళ్ళింది. వచ్చే ఏడాది జూలై లేదా ఆగష్టు కల్లా షూటింగ్ ని ఫినిష్ చేసి 2016 డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి.
ప్రస్తుతం బాహుబలి 2 కోసం సెట్స్ ని డిజైన్ చేస్తున్నారు. అలాగే రాజమౌళి కూడా బాహుబలి 2 కి కావాల్సిన మార్పులు చేర్పులు కూడా చేసేసాడు. బాహుబలి 2 తో ఆపెయకుండా బాహుబలి అనే పేరుని అలానే కొనసాగించాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడు.

