బాహుబలి బెనిఫిట్ షో కలెక్షన్స్ టార్గెట్ ఎంతంటే.?

baahubali

టాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మొట్ట మొదటది ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. టాలీవుడ్ స్టార్ అయిన ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ భరీ బడ్జెట్ మూవీ జూలై 10న నాలుగు భాషల్లో రిలీజ్ కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి ఆకాశాన్ని తాకే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలతోనే ఈ సినిమా టికెట్స్ కోసం బిగ్గెస్ట్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే అన్ని సింగల్ స్క్రీన్స్ లో మొదటి వీకెండ్ కి సంబందించిన టికెట్స్ అమ్ముడు పోయాయి.

ఇదిలా ఉంటే రిలీజ్ రోజు వేయనున్న బెనిఫిట్ షోస్ కి కూడా హై రేంజ్ లో క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా మంది 3 లేదా నాలుగు వేలకి బెనిఫిట్ షో టికెట్స్ అమ్ముతున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం నైజాం ఏరియా నుంచి బెనిఫిట్ షోస్ విషయంలో మునుపెన్నడూ లేనంత కలెక్షన్స్ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఒక్క నైజాం ఏరియా నుంచి కేవలం బెనిఫిట్ షోస్ ద్వారా 1 కోటి 20 లక్షల నుంచి 1 కోటి 50 లక్షల షేర్ వసూలు కానుందని అంటున్నారు. బెనిఫిట్ షోస్ వేయడానికి ధర కూడా ఎక్కువగా పలకడంతో టికెట్స్ రేటు కూడా బాగానే పలుకుతోంది. అందుకే ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని సమాచారం.

బెనిఫిట్ షోస్ పరంగానే ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తే మొదటి రోజు కలెక్షన్స్ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆర్కా మీడియా బారు నిర్మించనున్న ఈ సినిమాకిఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

Exit mobile version