రేపట్నుంచే ‘బాహుబలి’ సందడి!

రేపట్నుంచే ‘బాహుబలి’ సందడి!

Published on Apr 30, 2015 10:27 AM IST

Baahubali

దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్ దేశం ఎదురు చూస్తుందనడంలో సందేహం లేదు. మే 15నే ఈ సినిమా మొదటి భాగం విడుదలవుతుందన్న వారికి చేదు వార్తగా ఈ సినిమా జూలైలో విడుదలవుతుందన్న విషయాన్ని రాజమౌళి స్పష్టం చేశారు. అయితే అభిమానులకు ఈ చేదు వార్త నుండి కొంత ఉపశమనం కలిగించేలా మే 31న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

అదే విధంగా ట్రైలర్ విడుదలకు నెలరోజుల ముందునుంచే అంటే రేపటి (మే 1) నుంచే బాహుబలి సందడి మొదలవనుంది. సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రభాస్, అనుష్క, రానాలకు సంబంధించిన పోస్టర్లు, సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు.. ఇలా బాహుబలి ట్రైలర్ విడుదలయ్యే వరకూ ఏదో ఒక పోస్టర్‌తో హల్‌చల్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నాయ్. ఇంకా చాలా సన్నివేశాల విజువల్ ఎఫెక్ట్స్ పెండింగ్‌లో ఉండడంతో సినిమాను జూలైకి వాయిదా వేశారు.

ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు