టీవీ ప్రీమియర్‌తోనూ దుమ్మురేపిన ‘బాహుబలి’!

టీవీ ప్రీమియర్‌తోనూ దుమ్మురేపిన ‘బాహుబలి’!

Published on Oct 27, 2015 7:15 PM IST

baahubali-b
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో రూపొంది ఇండియన్ సినిమాలో ఓ సంచలనంగా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం.. ఇలా అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఇండియన్ మార్కెట్లో బాక్సాఫీస్ నెంబర్ వన్‌గా నిలబడి సత్తా చాటింది.

ఇక ఒక్క థియేట్రికల్ రిలీజ్‌లోనే కాక, టీవీ ప్రీమియర్‌లోనూ బాహుబలి మళ్ళీ సత్తా చాటి మరోసారి దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. దసరా పండుగ కానుకగా బాహుబలి సినిమా టీవీ ప్రీమియర్ తెలుగు, హిందీ భాషల్లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. శనివారం రోజున మాటీవీలో తెలుగు వర్షన్ ప్రదర్శితమై టీఆర్‌పీ రేటింగ్స్‌లో ఓ ప్రభంజనమే సృష్టించింది. ఇంకా అధికారికంగా ఈ రేటింగ్ వివరాలు రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బాహుబలికి సుమారు 35-40రేటింగ్ వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తెలుగు ప్రీమియర్‌కు ఏమాత్రం తగ్గకుండా బాహుబలి హిందీ వర్షన్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీలో టీఆర్‌పీల్లో ఇప్పటివరకూ హయ్యస్ట్‌గా నిలిచిన భజరంగీ భాయ్‌జాన్ రేటింగ్‌ను బాహుబలి దాటి ఉంటుందని ఒక అంచనా. ఆదివారం రోజున రాత్రి 8 గంటలకు బాహుబలి హిందీ ప్రీమియర్ ప్రదర్శితమైంది. ఒక సినిమా రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా టీవీల్లోనూ ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం విశేషంగానే చెప్పుకోవచ్చు. బాహుబలి అనే సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటనేది ఈ టీవీ ప్రీమియర్స్ మరోసారి ఋజువు చేశాయనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు