
గత వారం రోజులుగా ప్రతి ఒక్క సినీ అభిమానిని, ఫిల్మ్ వర్గాలను థ్రిల్ చేస్తున్న ఒకే ఒక్క విషయం బాహుబలి ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్. ఆంధ్ర, తెలంగాణలోని ప్రతి చిన్న టౌన్ నుంచి ఇండియా, ఓవర్సీస్ దాకా ప్రతి చోటా రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టుకొని సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ ని ఇండియన్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్ కి పరిచయం చేసిన సినిమా ‘బాహుబలి’. మన కళ్ళు రెప్ప వేయకుండా చేసే భారీ సెట్స్, ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్ లతో ‘బాహుబలి – ది బిగెనింగ్’ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తోంది.
ఇప్పటికే టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ ని బ్రేక్ చేసిన బాహుబలి ఫస్ట్ వీక్ తో 100 కోట్ల మార్క్ ని కూడా క్రాస్ చేయనుంది. నైజాంలో మునుపెన్నడూ లేని విధంగా కలెక్షన్స్ వసూలు చేస్తూ ఫుల్ రన్ లో సాధించిన పాత రికార్డ్స్ ని బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతోంది. కేవలం మొదటి 6 రోజుల్లోనే ఈ సినిమా 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. వీక్ డేస్ లో కూడా బాహుబలికి సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి. నైజాం ఏరియా మొదటి ఐదు రోజుల షేర్ వివరాలు..
| వారం | కలెక్షన్స్ (షేర్) |
| శుక్ర వారం | 6.22 కోట్లు |
| శని వారం | 3.55 కోట్లు |
| ఆది వారం | 3.65 కోట్లు |
| సోమవారం | 2.82 కోట్లు |
| మంగళవారం | 2.20 కోట్లు |
| బుధవారం | 2.20 కోట్లు |
| మొత్తం | 20.64 కోట్లు |

