
తెలుగు చలన చిత్ర సీమతో పాటు, భారత చలన చిత్ర సీమ కూడా గర్వించదగ్గ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వచ్చిన మూవీ ‘బాహుబలి’. ఒకే సారి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 400కి పైగా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. విడుదలైన ప్రతి చోటా, విడుదలైన అన్ని భాషల్లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తోంది. ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో ఈ సినిమాని రూపొందించిన సంగతి మనకు తెలిసిందే. ఈ రెండు భాషల్లోనే కాకుండా డబ్ చేసిన హిందీలో కూడా ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది.
ఒక్క హిందీలో అది కూడా ఇండియా వైడ్ మాత్రమే ఫస్ట్ వీకెండ్ ఈ సినిమా 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. మొదటి రోజు కాస్త తక్కువ షేర్ తో మొదలైనా రెండవ మూడవ రోజు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే కలెక్షన్స్ ని నమోదు చేసింది. కేవలం హిందీలో మొదటి మూడు రోజుల్లో కలెక్ట్ చేసిన షేర్ వివరాలు..
| వారం |
కలెక్షన్స్ (షేర్) |
| శుక్ర వారం | 5.15 కోట్లు |
| శని వారం | 7.09 కోట్లు |
| ఆది వారం | 10.11 కోట్లు |
| మొత్తం |
22.35 కోట్లు |
ఒక తెలుగు సినిమా డబ్ వెర్షన్ బాలీవుడ్ లో జస్ట్ ఫస్ట్ వీకెండ్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం ఓ రికార్డ్ అని చెప్పాలి. ఫస్ట్ వీకెండ్ కి సంబందించిన ప్రత్యేక కలెక్షన్ రిపోర్ట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం.. స్పెషల్ అప్డేట్స్ కోసం 123తెలుగు. కామ్ ని విజిట్ చేస్తూ ఉండండి.

