సినిమా బడ్జెట్ సుమార్ 250కోట్లకి పైనే, ప్రీ ప్రొడక్షన్ మరియు షూటింగ్ కి పట్టిన సమయం మూడేళ్ళు, ఇక సినిమా రేంజ్ విషయానికి వస్తే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మొట్ట మొదటి బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్.. ఇవన్నీ దేనిగురించి చెబుతున్నానో ఈ పాటికే అర్థమయ్యుంటుంది అనుకుంటా.. మరో రెండు రోజుల్లో మన ముందుకు రానున్న భారీ పీరియడ్ ఫిల్మ్ ‘బాహుబలి’. రెండు పార్ట్స్ గా రూపొందిన ఈ సినిమా మొదటి పార్ట్ జూలై 10న రిలీజ్ కానుంది. అభిమానుల్లో ఉన్న అంచనాల మేర, అలాగే రాజమౌళి మీద ఉన్న నమ్మకంతో భారీ రేటుకి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు.
మాకు అందిన సమాచారం ప్రకారం బాహుబలిని కర్ణాటకలో రిలీజ్ చెయ్యడానికి భారీ అమౌంట్ పెట్టి ఓ బయ్యర్ కొనుకున్నాడు. కానీ అతను ఈ సినిమాని రిలీజ్ చెయ్యకుండా మంచి ఆఫర్ రావడంతో 5 కోట్ల లాభంతో మరో డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేశాడు. దాంతో అతనికి వచ్చిన లాభం అక్షరాల 5 కోట్లు. బాహుబలి సినిమాపై ఉన్న నమ్మకంతోనే ఆ డిస్ట్రిబ్యూటర్ అంత పెట్టి కొన్నాడు. మరి సినిమా ఎంత మేరకు లాభాలు తెచ్చిపెడుతుందో చూడాలి అంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా కోసం ప్రభాస్ రెండున్నరేళ్ళుకి పైగా సమయాన్ని కేటాయించడమే కాకుండా, రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. రానా, తమన్నా, అనుష్క, రమ్య కృష్ణ, సత్య రాజ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.


