
ప్రముఖ దర్శకుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ మరియు ఇతర భాషలలో ఈ సినిమాను మే 15న విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై భారతీయ సినీ పరిశ్రమలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. అంతర్జాతీయ సినిమాలను తలదన్నే రీతిలో రాజమౌళి సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలు, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
ప్రభాస్, అనుష్క, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న ఈ భారి బడ్జెట్ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. డబ్బింగ్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి గ్రాఫిక్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్నారు.

