‘బాహుబలి’ పార్ట్ 2 షూటింగ్ వివరాలు.!

‘బాహుబలి’ పార్ట్ 2 షూటింగ్ వివరాలు.!

Published on Jul 13, 2015 8:46 PM IST

baahubali
ఒకటిన్నరేళ్ళు ప్రీ ప్రొడక్షన్ చేసి రెండు పార్ట్స్ గా సినిమా చేయాలని నిర్ణయించుకొని రెండేళ్ళు మొదటి పార్ట్ కోసం షూటింగ్ చేసిన మొట్ట మొదటి ఇండియన్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి’. ఇలా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసిన బాహుబలి సినిమా గత శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని నమోసు చేస్తోంది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రతి భాషలోనూ సూపర్బ్ షేర్స్ ని కలెక్ట్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ ని లాభాల బాటలో తీసుకెలుతున్నాయి. దాదాపు మూడేళ్ళు ఎంతో కష్టపడిన ఈ చిత్ర టీం బాహుబలి సక్సెస్ తో ఆ కష్టాన్ని మరిచిపోయారు. అలాగే రీసెంట్ గా ఈ చిత్ర టీం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ తో, సెకండ్ పార్ట్ కి సంబందించిన ట్రైలర్ విజువల్స్ తో అందరి దృష్టి సెకండ్ పార్ట్ పైకి వెళ్ళింది. దాంతో ఎప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది, ఎప్పుడు రిలీజ్ నన్ విషయాలకు మేము కాస్త క్లారిటీ ఇవ్వనున్నాం. బాహుబలి పోస్ట్ ప్రమోషన్స్ ని ఫినిష్ చేసిన తర్వాత రాజమౌళి, అతని ఫ్యామిలీ మరియు ప్రభాస్ లు కొద్దీ రోజుల పాటు అకేషన్ కోసం బయట దేశాలకు వెళ్లనున్నారు. సుమారు ఓ 20-30 గ్యాప్ తర్వాత మళ్ళీ తిరిగి సెకండ్ పార్ట్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు. ఎక్కువ భాగం ఆగష్టు చివరి వారం నుంచి లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి బాహుబలి సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలవుతుంది.

120 రోజులు సెకండ్ పార్ట్ ని షూట్ చేసి, వచ్చే ఏడాది ఇదే టైంకి రిలీజ్ చేసే పనిలో ఈ చిత్ర టీం ఉంది. ప్రభాస్ ని డీ కొట్టే విలన్ గా రానా దగ్గుబాటి కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు హీరోయిన్స్ గా కనిపించనున్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీని ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు.

తాజా వార్తలు