స్పుఫ్ లతో సందడి చేస్తున్న బాహుబలి ట్రైలర్

స్పుఫ్ లతో సందడి చేస్తున్న బాహుబలి ట్రైలర్

Published on Jun 17, 2015 12:59 AM IST

Baahubali
ఇటీవలే విడుదలైన బాహుబలి ట్రైలర్ చాలా సంచలనాలకి కేంద్ర బిందువైంది. యూ ట్యూబ్ లో రెండు వారాల క్రితం అప్ లోడ్ అయిన ఈ ట్రైలర్ ఎన్నో రికార్డులు తిరగరాసింది. ఇప్పటిదాకా మరే ట్రైలర్ కూడా ఇన్ని వ్యూస్ తెచ్చుకోలేదు. బాహుబలి ట్రైలర్ కి ఇప్పటిదాకా 40 లక్షల క్లిక్స్, 31వేలకు పైగా లైక్స్ రావడం విశేషం ఈ ట్రైలర్ అప్ లోడ్ అయిన ఒక్క రోజులోనే మిలియన్ వ్యూస్ పైగా తెచ్చుకుంది.

హాలీవుడ్ స్థాయిలో వున్న ఈ ట్రైలర్ కి తమవంతు కృషిగా ప్రముఖ చిత్రాల ట్రైలర్లు స్పూఫ్ చేసి వదులుతున్నారు. అందులో అవతార్, 300, కార్స్ 2, ఇలా ఎన్నో సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రాలకి స్పూఫ్ వీడియోలు వదిలారు. అవి అందరినీ ఎంతో అలరించాయి. బాహుబలి ఆడియో లాంచ్ లో “అవతార్ – బాహుబలి” ట్రైలర్ ని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. తాజా గా సంపూర్ణేష్ బాబు వీడియోని జత చేస్తూ వదిలిన ట్రైలర్ కూడా నెట్ లో హల్ చల్ చేస్తుంది. విధంగా ఈ రకంగా బాహుబలి సినిమాకు ప్రచారం జరగడం ఆనందకరమే.

తాజా వార్తలు