
ప్రపంచంలోని తెలుగువారందరూ గర్వించేలా చేసిన తెలుగు సినిమా ‘బాహుబలి’. దానికి కారణం హాలీవుడ్ కి ధీటుగా ఈ సినిమాలోని టెక్నికల్ వాల్యూస్ ఉండడం. ఇండియన్ మరియు తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్టింగ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన బాహుబలి థియేటర్స్ లో ఆడియన్స్ ని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే అటు విమర్శకుల చేత, ఇటు ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకుంటూ నాలుగు భాషల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమాని అన్ని ఇండస్ట్రీల నుంచి సెలబ్రిటీస్ అంతా కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుండడంతో ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.
ఒక్క ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఎన్నడూ లేనంతగా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఓ ఓవర్సీస్ లో తెలుగు సినిమా పరంగా ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి 5 మిలియన్ మార్క్ దిశగా సినిమా దూసుకెలుతోంది. మొదటి 5 రోజుల్లో దాదాపు 4.7 మిలియన్ డాలర్స్(ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 29కోట్లు) కలెక్ట్ చేసింది. యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రకారం ఈ సినిమా క్లోజింగ్ టైంకి ఓవర్సీస్ లో 35 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. ఓ తెలుగు సినిమా ఓవర్సీస్ లో ఇంత కలెక్ట్ చెయ్యడం ఇదే ప్రధమం. రాజమౌళి క్రేజ్ మరియు ప్రభాస్ కి యుఎస్ లో మంచి మార్కెట్ ఉండడం వలన ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయని సమాచారం.
ప్రభాస్ శివుడు, బాహుబలి అనే పాత్రల్లో మెప్పిస్తే తమన్నా అవంతికగా, రానా నెగటివ్ షేడ్స్ ఉన్న భళ్లాలదేవగా కనిపించి మెప్పించారు.

