‘బాహుబలి 2’ 9 ఏళ్ల రికార్డు బద్దలు.. ఫీట్ సాధించిన సినిమాపై టీం రియాక్షన్ ఇదే!

‘బాహుబలి 2’ 9 ఏళ్ల రికార్డు బద్దలు.. ఫీట్ సాధించిన సినిమాపై టీం రియాక్షన్ ఇదే!

Published on Mar 29, 2026 6:58 PM IST

Baahubali and dhurandhar

ఒక్క తెలుగు సినిమా దగ్గరే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా గేమ్ ఛేంజర్ గా నిలిచిన సినిమానే బాహుబలి. పార్ట్ 1 అలాగే పార్ట్ 2లు ఒకదాన్ని మించి ఒకటి భారీ వసూళ్లతో సక్సెస్ సాధించాయి. అయితే ఈ సినిమాల్లో పార్ట్ 2 వరల్డ్ వైడ్ రికార్డు వసూళ్లు చెక్కు చెదరకుండా సెట్ చేసుకుంది. ఇలా యూఎస్ మార్కెట్ లో సెట్ చేసిన 20 మిలియన్ డాలర్స్ కి పైగా లైఫ్ టైంలో అందుకుంది.

అయితే ఈ రికార్డ్ 9 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంది. టోటల్ ఇండియా వైడ్ గా ఏ సినిమా కూడా దీన్ని బ్రేక్ చెయ్యలేదు. కానీ ఫైనల్ గా మరో సెన్సేషనల్ సీక్వెల్ ధురంధర్ పార్ట్ 2 దీనిని బ్రేక్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ మూమెంట్ పై బాహుబలి మేకర్స్ అండ్ టీం ఆనందం వ్యక్తం చేస్తూ తమ రెస్పాన్స్ షేర్ చేసుకున్నారు.

9 ఏళ్ళు పాటు ఉన్న తమ బాహుబలి 2 రికార్డ్ ని ధురంధర్ 2 క్రాస్ చేయడం సంతోషం అని ఇండియా, వరల్డ్ వైడ్ సంచలనం సెట్ చేస్తున్న ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ అండ్ టీం కి శుభాకాంక్షలు తెలుపుతూ బాహుబలి టీం చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

తాజా వార్తలు