టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పటిన మాగ్నమ్ ఓపస్ చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి విజన్ నుంచి వచ్చిన ఈ ప్రెస్టీజియస్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క శెట్టి, తమన్నా తదితరులు నటించిన ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇక ఇటీవల ఈ రెండు సినిమాలను ఒకే సినిమాగా రీ-కట్ చేసి ‘బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో రిలీజ్ చేశారు. బాహుబలి చిత్రానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఈ చిత్రం మరోసారి రుజువు చేసింది. ఇక ఇప్పుడు మరో కొత్త అధ్యయనానికి బాహుబలి తెరలేపాడు. బాహుబలి చిత్రాన్ని కామిక్ సిరీస్‌గా తీసుకురాబోతున్నట్లు చిత్ర నిర్మాతలు గతంలో వెల్లడించారు.
ఇప్పుడు దానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో బాహుబలి దేవేంద్రుడి మధ్య యుద్ధం మొదలైందనే కాన్సెప్ట్ మనకు చూపెట్టారు. దేవ-అసుర మధ్య జరిగే సంగ్రామంలో బాహుబలికి ఎలాంటి సంబంధం ఉందో తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఇక ఈ ‘బాహుబలి ది ఎటర్నెల్ వార్ పార్ట్ 1’ను ఇషాన్ శుక్లా డైరెక్ట్ చేస్తుండగా రాజమౌళి ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


