త్వరలోనే ‘బాహుబలి’ మరో ఆడియో లాంచ్?

త్వరలోనే ‘బాహుబలి’ మరో ఆడియో లాంచ్?

Published on Jun 14, 2015 12:55 PM IST

Baahubali-pposter
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి మొదటి భాగానికి సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక నిన్న తిరుపతిలో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే! బాహుబలి సినిమాకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్ల సమక్షంలో, రాజమౌళి స్టైల్లో వైవిధ్యంగా ఈ వేడుక జరిగింది. నటీనటులు, టెక్నీషియన్లు తమ తమ అనుభవాలను, అనుభూతులను పంచుకోవడానికి బాహుబలి ఆడియో వేడుక సరైన వేదికగా పనిచేసింది. అయితే ఈ వేడుకకు సినీ ప్రముఖులు ఎవరూ హాజరుకాలేదు.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు బాహుబలికి సంబంధించిన మరో ఆడియో ఆవిష్కరణ వేడుకను హైద్రాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సినిమా యూనిట్ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నట్లు సమాచారం. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరగననున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకున్నా, ఇలాంటి ఆడియో వేడుకలో బాహుబలి లాంటి సినిమా గురించి పరిశ్రమలోని ప్రముఖులు మాట్లాడితే చూడడం సగటు ప్రేక్షకుడికి ఆనందానిచ్చే విషయమే!

తాజా వార్తలు