ఓవర్సీస్ : 6 మిలియన్ మార్క్ తో టాప్ 6లో ‘బాహుబలి’

ఓవర్సీస్ : 6 మిలియన్ మార్క్ తో టాప్ 6లో ‘బాహుబలి’

Published on Jul 17, 2015 3:00 AM IST

baahubali
ప్రస్తుతం మన ఇరు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న పేర్లు రెండే రెండు.. అందులో మొదటిది గోదావరి పుష్కరాలు అయితే, రెండవది బాహుబలి. ఇండియన్ మరియు తెలుగు సిల్వర్ స్క్రీన్ పై కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్టింగ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించిన భారీ పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. విడుదలైన మొదటి రోజు నుంచే అటు విమర్శకుల చేత, ఇటు ప్రేక్షకుల చేత సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన నాలుగు భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. కేవలం 6 రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో కలుపుకొని 58 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీక్ లో 100కోట్ల మార్క్ ని క్రాస్ చేయనుంది.

ఒక్క లోకల్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని నమోదు చేస్తోంది. తెలుగు సినిమా పరంగా ఇప్పటికే ఆల్ టైం రికార్డ్ అయ్యి కూర్చుంది. ఓవర్సీస్ లో నాలుగు భాషల్లోనూ రిలీజ్ అయ్యింది. మొదటి 6 రోజుల్లో బాహుబలి సినిమా అన్ని భాషల్లో కలుపుకొని 6 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసింది. అంతే కాకుండా ఓవర్సీస్ లో ఇప్పటివరకూ టాప్ గ్రాసర్స్ గా నిలిచిన సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ లిస్టులో 6వ ప్లేస్ ని దక్కించుకుంది. షేర్స్ పరంగా సౌత్ ఇండియన్ టాప్ 6 మూవీస్ లిస్టు మీకోసం..

సినిమా
కలెక్షన్స్ (మిలియన్ డాలర్స్ లో)
ఎందిరన్(రోబో)  $ 14.5M
 $ 9M
శివాజీ $ 8.8M
లింగ  $ 6.7M
కత్తి $ 6.5M
బాహుబలి $ 6.1M (ఇంకా క్లోజ్ కాలేదు)

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మొదటి 5 సినిమాలు టోటల్ రన్ లో కలెక్ట్ చేసిన షేర్ వివరాలు అవి, బాహుబలి విషయానికి వస్తే కేవలం మొదటి 6 రోజుల్లో వచ్చిన షేర్ వివరాలు మాత్రమే ఇక్కడ ఇచ్చాం. ఓవరాల్ గా క్లోజ్ అయ్యే సమయానికి బాహుబలి సినిమా 3 లేదా 4వ స్థానంలో నిలవడం గ్యారంటీ అని ఓవర్సీస్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తాజా వార్తలు