అంతర్జాతీయ అవార్డును కైవసం చేసుకున్న ‘బాహుబలి-2’ !
Published on Jun 28, 2018 6:09 pm IST

ఇప్పటికే పలు అవార్డుల్ని కైవసం చేసుకున్న ‘బాహుబలి-2’ చిత్రం తాజాగా ఒక అంతర్జాతీయ అవార్డును చేజిక్కించుకుంది. బుధవారం రాత్రి కాలిఫోర్నియాలోని బుర్బ్యాంక్ లో జరిగిన 44వ సాటర్న్ అవార్డ్స్ ప్రకటనలో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-2’ కు ఉత్తమ అంతర్జాతీయ చిత్ర అవార్డ్ దక్కింది.

దీంతో చిత్ర యూనిట్ కు మరోసారి సగర్వంగా ఫీలయ్యే అవకాశం లభించింది. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రల్లో ఆర్కా మీడియా సంస్థ ఈ నిర్మించింది. ఇకపోతే అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, హర్రర్ ప్రకటించిన ఈ అవార్డుల్లో అత్యధికంగా డిస్నీ, మార్వెల్స్ వారి ‘బ్లాక్ పాంథర్’ ఐదు అవార్డుల్ని పొందగా ‘స్టార్ వార్స్ – ది లాస్ట్ జెడి’ మూడు అవార్డులకి ఎంపికైంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook