హిందీలో ‘బాహుబలి’ సరికొత్త రికార్డ్!

హిందీలో ‘బాహుబలి’ సరికొత్త రికార్డ్!

Published on Jul 11, 2015 8:13 PM IST

Baahubali-still
దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ‘బాహుబలి’. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున నిన్న విడుదలైన ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచీ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. హిందీలో డబ్బింగ్ సినిమాలనేవీ పెద్దగా ఆడవు అనే నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా హిందీలోనూ సత్తా చాటింది. ఇప్పటివరకూ ఏ డబ్బింగ్ సినిమాకూ సాధ్యపడని రికార్డును సొంతం చేసుకుంది. బాలీవుడ్‌లో ఈ సినిమా మొదటిరోజు 5.15కోట్ల రూపాయలు వసూలు చేసి సూపర్ అనిపించుకుంది.

రాజమౌళి విజన్‌కి, గ్రాఫిక్స్, ఆర్ట్ వర్క్‌.. లాంటివి ఇండియన్ సినిమా ప్రేక్షకుడిని విపరీతంగా కట్టిపడేశాయి. నాలుగు భాషల్లో ఒకేసారి విడుదల కావడం, దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో విడుదలైన సినిమా కావడంతో ‘బాహుబలి’ మొదటిరోజు అంతటా అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొట్టింది. శని, ఆదివారాల్లో ఈ కలెక్షన్లు మరింత పెరగనున్నాయని ట్రేడ్ టాక్!

తాజా వార్తలు