సంచలనం సృష్టిస్తున్న ‘బాహుబలి 2’ లీకేజ్ వీడియో !
Published on Nov 22, 2016 11:20 am IST

baahubali-2

దర్శక ధీరుడు రాజమౌళి అద్భుత సృష్టి ‘బాహుబలి’ మొదటి భాగం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు దీనికన్నా గొప్పగా రెండవ పార్ట్ ను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది. షూటింగ్ తో పాటు సీజీ వర్క్ కూడా జరుగుతోంది. అయితే నిన్న సాయంత్రం ఈ చిత్రానికి సంబందించిన ఒక వీడియో లీకైంది. ఇందులో హీరోయిన్ అనుష్కకు సంబందించిన విజువల్స్, యుద్ధ సన్నివేశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది.

గతంలో కూడా బాహుబలి మొదటి పార్ట్ కు సంబందించిన కొని విజువల్స్ ఇలాగే లీకై టీమ్ ను ఇబ్బంది పెట్టాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా లీకవడంతో టీమ్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ లీకేజ్ వీడియో ఏ అకౌంట్ల ద్వారా బయటికొచ్చిందో వాటిని బ్లాక్ చేసింది యాంటీ పైరసీ టీమ్. అలాగే ఈ లీకేజ్ కు పాల్పడింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్, సంవత్సరాల కష్టాన్ని పెట్టి సినిమాలు తీస్తే ఇలా లీకేజ్ కు గురవడం చాలా విచారకరం. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరమే ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నారు.

 
Like us on Facebook