రేపట్నుంచి బాహుబలి తాజా షెడ్యూల్

రేపట్నుంచి బాహుబలి తాజా షెడ్యూల్

Published on Apr 19, 2014 6:12 PM IST

Bahubali
చిన్న విరామం తరువాత బాహుబలి షూటింగ్ ఏప్రిల్ 20నుండి రామోజీ ఫిలింసిటీలో తిరిగిప్రారంభంకానుంది. సినిమాకు రాజమౌళి దర్శకుడు. ప్రభాస్, రానా, తమన్నా మరియు అనుష్క ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్ దేవినేని ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు

ఈ సినిమా గత షెడ్యూల్ కొన్ని నెలలపాటు ఒక యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ప్రభాస్, రానా మరియు ముఖ్యపాత్రధారులు ఈ షెడ్యూల్ లో పాల్గుని భారతీయ చలన చిత్రంలోనే నభూతో అన్న రీతిలో తెరకెక్కించారని సమాచారం. “రేపట్నుంచి ఆర్.ఎఫ్.సి లో కొత్త షెడ్యూల్… సూర్యుడిని ఎదుర్కోవడానికి సిద్ధం :)” అని రాజమౌళి ట్వీట్ చేసాడు

తెలుగు సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్ మూవీగా బాహుబలి తెరకెక్కుతుంది. ఈ సినిమా 2015 వేసవిలో విడుదలకానుంది. సెంథిల్ సినిమాటోగ్రాఫర్. సిబు సైరిల్ ఆర్ట్ డైరెక్టర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు