కరణ్ జోహార్ రిలీజ్ చేయనున్న ‘బాహుబలి’ సెకండ్ సాంగ్

కరణ్ జోహార్ రిలీజ్ చేయనున్న ‘బాహుబలి’ సెకండ్ సాంగ్

Published on Jun 25, 2015 2:58 PM IST

Baahubali
భారతదేశం చలనచిత్ర సీమ గర్వించదగ్గ సినిమాగా, ఇంటర్నేషనల్ టెక్నికల్ స్టాండర్డ్స్ తో హాలీవుడ్ సినిమాని తలపించేలా తీసిన సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ సూపర్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం రెండున్నరేళ్ళ పాటు ఎంతో శ్రమించి తీసిన ఈ సినిమా మొదటి పార్ట్ ‘బాహుబలి – ది బిగెనింగ్’ టైటిల్ తో జూలై 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో మే నుంచి మొదలైన ఈ చిత్ర ప్రమోషన్స్ ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మరింత ఊపందుకున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ మరియు సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవలే ఈ సినిమాలోని ‘మమతల తల్లి’ పాట విజువల్స్ ని రిలీజ్ చేసారు. ఆ సాంగ్ లో విజువల్స్ కి అన్ని భాషల ఉంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ రోజు ఈ చిత్ర టీం హిందీలో సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయనుంది. ఈ రోజు సాయంత్రం ముంబైలో జరగనున్న బాహుబలి ప్రమోషనల్ ఈవెంట్ లో సెకండ్ సాంగ్ ని బాలీవుడ్ టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన కరణ్ జోహార్ రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ వేడుకకి హాజరవుతాడు. హిందీ రిలీజ్ చేసిన కొద్ది సమయం తర్వాత ఇదే పాటని తెలుగు, తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తారని సమాచారం.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, సత్యరాజ్, సుధీప్, నాజర్, ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్కా మీడియా బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ బాహుబలి మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు