రజినీ ‘రోబో’ రికార్డ్ ని బ్రేక్ చేసిన ‘బాహుబలి’

రజినీ ‘రోబో’ రికార్డ్ ని బ్రేక్ చేసిన ‘బాహుబలి’

Published on Jul 19, 2015 10:05 AM IST

baahubali-robo

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసి, అన్ని చోట్లా ఆల్ టైం రికార్డ్స్ సృష్టిస్తున్న సినిమా ‘బాహుబలి’. టాలీవుడ్ జక్కన్న మూడేళ్ళ పాటు ఎంతో కష్టపడి చెక్కిన ఈ బాహుబలి టోటల్ గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఒక్క తెలుగులోనే కాకుండా ప్రతి భాషలోనూ అందరినీ షాకింగ్ కి గురి చేసేలా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులో మొదటి వారం 61కోట్ల షేర్ మార్క్ టచ్ చేసిన బాహుబలి హిందీలో 45కోట్ల షేర్ మార్క్ ని, తమిళంలో 20 కోట్ల షేర్ మార్క్ ని మరియు మలయాళంలో 3 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేసింది. వీకెండ్ కూడా బాహుబలి ఇదే జారుని కొనసాగిస్తోంది. లోకల్ మరియు ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.

ఇప్పటికే టాలీవుడ్ ఆల్ టైం రికార్డ్ ని బద్దలు కొట్టిన బాహుబలి ఇప్పుడు సౌత్ ఇండియన్ ఆల్ టైం రికార్డ్ ని కూడా బద్దలు కొట్టింది. ఇప్పటివరకూ సౌత్ ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రజినీకాంత్ ‘రోబో’ ఉంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం మొదటి 9 రోజుల్లో బాహుబలి సినిమా రోబో వరల్డ్ వైడ్ షేర్ ని క్రాస్ చేసిందని తెలిపారు. సెకండ్ వీకెండ్ తర్వాత పూర్తి షేర్ వివరాలను రిలీజ్ ఆమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ శివుడు, బాహుబలి అనే పాత్రల్లో మెప్పిస్తే తమన్నా అవంతికగా, రానా నెగటివ్ షేడ్స్ ఉన్న భళ్లాలదేవగా కనిపించి మెప్పించారు.

తాజా వార్తలు