సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !

సమీక్ష : “బాక్” – రొటీన్ హారర్ థ్రిల్లర్ !

Published on May 4, 2024 3:05 AM IST
Baak Movie Review in Telugu

విడుదల తేదీ : మే 03, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: సుందర్. సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

దర్శకుడు: సుందర్. సి

నిర్మాత: ఖుష్బూ సుందర్

సంగీత దర్శకుడు: హిప్ హాప్ తమిళా

సినిమాటోగ్రఫీ: ఇ.కృష్ణసామి

ఎడిటింగ్: ఫెన్నీ ఆలివర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా బాక్. మరి ఈ సినిమా హిట్ అయిందా ? లేదా ? అన్నది సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ :

శివ శంకర్ (సుందర్ సి) ఒక లాయర్. తన చెల్లి శివాని (తమన్నా భాటియా) ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. ఐతే, బాక్ అనే దుష్టశక్తి కారణంగా శివాని ఆమె భర్త చనిపోతారు. అసలు ఈ బాక్ ఎవరు ?, ఈ దుష్ట శక్తి ఎందుకు శివాని కుటుంబాన్ని టార్గెట్ చేసింది?, శివాని పిల్లలను ఓ ఆత్మగా మారి శివాని ఎలా కాపాడింది ?, మరోవైపు శివ శంకర్ తన చెల్లి పిల్లల కోసం ఏం చేశాడు ?, ఆ బాక్ ను ఎలా అంతం చేశాడు ?, ఈ మొత్తం వ్యవహారంలో మాయ (రాశి ఖన్నా) పాత్ర ఏమిటి ?, చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మొత్తానికి భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్ గా తీసుకొని దర్శకుడు సుందర్. సి ఈ సినిమాతో మన ముందుకు వచ్చాడు. సహజంగా ఈ జోనర్ లో సినిమా అంటేనే.. కామెడీ, భయం లాంటి అంశాలతో అల్లుకొని రాసుకున్న సీన్స్ తోనే ప్రధానంగా సినిమా సాగుతుంది. ఈ సినిమా కూడా అలాగే సాగింది. ముఖ్యంగా సుందర్. సి ఇటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అటు భయాన్ని, ఎమోషన్ని కూడా బాగానే పండించాడు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తమన్నా భాటియా నటనే హైలైట్ గా నిలుస్తోంది. మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా బాగా నటించింది.

హీరోగా సుందర్. సి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని హర్రర్ సన్నివేశాల్లో తన నటనతో సుందర్. సి మెప్పించాడు. ‌ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన కోవై సరళ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు. దర్శకుడిగా సుందర్. సి హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. హిప్ హాప్ తమిళా అందించిన సంగీతం చాలా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు సుందర్. సి తెరకెక్కించిన కొన్ని హర్రర్ అండ్ కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ప్లో మిస్ అయింది. ఏ సీన్ కి ఆ సీన్ బాగుందనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. ఇకపోతే కథనం మరియు నేరేషన్ లో ఇంతకు ముందు వచ్చిన హారర్ సినిమాల్లో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మాట్ నే ఈ సినిమాలో కూడా ఫాలో అయ్యారు. దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది.

పైగా కొన్ని కామెడీ సీన్స్ కోసమని ఈ బాక్ సినిమా లెంగ్త్ ని పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్. సెకండాఫ్ మొదలైన 10 నిమిషాల తర్వాత గాని ప్రేక్షకుడు అసలు కథలోకి వెళ్ళడు. దీనికి తోడు అక్కడక్కడ తమిళ్ నేటివిటీ సినిమాలో ఎక్కువుగా కనిపిస్తోంది. అలాగే కోవై సరళ కామెడీ కూడా బాగా విసిగించింది. అసలు అనవసరమైన వర్కౌట్ కానీ కామెడీ ట్రాక్స్ ను తీసేసి ఉంటే.. సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. ఓవరాల్ గా హారర్ సీన్స్, సెకండ్ హాఫ్ లో ప్లాష్ బ్యాగ్ ఎలిమెంట్స్ బాగున్నా.. మిగతా కంటెంట్ అంతా తేలిపోయింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. అందులో మొదటగా చెప్పుకోవాల్సింది దర్శకుడు సుందర్. సి దర్శకత్వ పనితనం గురించే.. కొన్ని విసిగించే సీన్స్ ను కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయ్యింది. అలాగే సినిమాలో చేసిన గ్రాఫిక్స్ కూడా బాగానే ఉన్నాయి. హిప్ హాప్ తమిళా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా సాగిన, సెకెండ్ హాఫ్ ను కట్ చేసిన విధానం బాగుంది. నిర్మాత ఖుష్బూ సుందర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘బాక్’ అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామా.. కొన్ని హారర్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో కొన్ని చోట్ల బాగానే ఆకట్టుకుంది. తమన్నా – రాశి ఖన్నా తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు. కాకపోతే వర్కౌట్ కానీ కామెడీ ట్రాక్స్, అండ్ రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్తే.. ఈ సినిమాలో కొన్ని ఫన్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు