
‘రూప్పుతేరా మస్తానా’ సాంగ్ తో తెలుగు ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన ఇండియన్ పాప సింగర్ బాగా సెహగల్. ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బాబా సెహగల్ టాలీవుడ్ పీరియాడికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’ సినిమాతో నటుడిగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో బాబా సెహగల్ చేసింది ఓ చిన్న పాత్రే.. కానీ ఇప్పుడు ఏకంగా ఫుల్ లెంగ్త్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో బాబా సెహగల్ కనిపించనున్నాడు. ఇంతకీ ఎవరి సినిమా అనుకుంటున్నారా.? ఇంకెవరు మన టాలీవుడ్ లవర్ బాయ్ అక్కినేని నాగ చైతన్య.
ఏమాయ చేసావే సినిమా తర్వాత నాగ చైతన్య – గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఒకేసారి తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వెర్షన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెయిన్ విలన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాబా సెహగల్ కనిపించనున్నాడు. ‘గౌతమ్ మీనన్ నాగ చైతన్య – శింబుతో చేస్తున్న ద్విభాషా చిత్రంలో మెయిన్ విలన్ గా చేస్తున్నానని’ బాబా సెహగల్ తెలియజేశాడు. మలయాళ భామ మంజిమ మోహన్ ఈ సినిమాలో నాగ చైతన్య సరసన జోడీ కట్టనుంది. తెలుగులో ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

