వైష్ణవి చైతన్య కు బేబీ టీమ్ స్పెషల్ పోస్టర్ తో బర్త్ డే విషెస్

Published on Jan 4, 2022 1:30 pm IST

న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా పండక్కి లాంఛనంగా ప్రారంభమైన బేబీ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం తో వైష్ణవి చైతన్య నాయికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పుట్టినరోజు సందర్భంగా టీమ్ మెంబర్స్ విషెస్ తెలిపారు. వైష్ణవి చైతన్య స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. పొయెటిక్ గా డిజైన్ చేసిన బర్త్ డే పోస్టర్ లో వైష్ణవి చైతన్య చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది.

విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ సినిమా నిర్మించిన ఎస్. కె. ఎన్ బేబీ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్త సంస్థ మాస్ మూవీ మేకర్స్ పతాకంపై బేబీ సినిమా నిర్మితమవుతోంది. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ రెడ్డి, సంగీతం, విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :