మాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్…విడుదలైన బేబీ ఓ బేబీ ప్రోమో..!

Published on Jul 15, 2021 6:00 pm IST

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మాస్ట్రో. ఈ చిత్రం లో నితిన్ సరసన హీరోయిన్ గా నబ్బా నటేష్ నటిస్తోంది. మరొక కథానాయికగా తమన్నా భాటియా నటిస్తోంది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో సాంగ్ విడుదల అయింది. బేబి ఓ బేబీ అంటూ విడుదల అయిన ప్రోమో సాంగ్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి లిరికల్ సాంగ్ రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల కానుంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వం లో హీరో నితిన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. బేబి ఓ బేబి పాటకి శ్రీజో లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి స్వరపరిచారు. ఎన్. సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డి లు చిత్రానికి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :