మహేష్ బాబు అభిమానులు సిద్ధంగా ఉండండి !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రం చివరి దశ పనుల్లో ఉంది. ప్రసుతం డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా మొదలైన దగ్గర్నుండి ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ ఓత్ పేరుతో ఓక్ ఆడియో క్లిప్ ను, ఫస్ట్ విజన్ పేరుతో చిన్నపాటి టీజర్ ను మాత్రమే విడుదలచేసిన చిత్ర యూనిట్ త్వరలో వరుస విశేషాలతో ప్రేక్షకుల్ని అలరించనుంది.

ముందుగా ఆడియోలోని రెండు పాటల్ని ఈ నెలలో విడుదలచేసి మూడో పాటను ఏప్రిల్ మొదటి వారంలో అలాగే పూర్తి ఆడియోను ఏప్రిల్ 7న జరగబోయే ప్రీ రిలీజ్ వేడుకలోను రిలీజ్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ అంశంపై చిత్ర యూనిట్ నుండి మాత్రం ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడలేదు. ఒకవేళ చిత్ర యూనిట్ ఈ ప్లాన్ ప్రకారమే పాటల్ని రిలీజే చేస్తే అభిమానులు ఫుల్ ఖుషీ అవడం ఖాయం. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న రిలీజ్ చేయనున్నారు.