ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ !

Published on Sep 18, 2018 11:01 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తరువాత తన మాస్ ఇమేజీకి తగ్గట్లుగా పూర్తి స్థాయి యాక్షన్ సినిమాగా చేస్తున్న సినిమా ‘అరవింద సమేత’. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తోన్న ఓ వార్త ఇపుడు ఎన్టీఆర్ అభిమానులను నిరుత్సాహ పరుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఎనర్జిటిక్ డ్యాన్స్‌ చూసేందుకు ఆయన అభిమానులకు అవకాశం లేదట.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. ఫారెన్ లో షూట్ చేయాల్సిన ఓ సాంగ్ ను తొలిగించారని సమాచారం. దీంతో ఇక సినిమాలో నాలుగు సాంగ్స్ మాత్రమే ఉంటాయట. ఆ నాలుగు సాంగ్స్ లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్ ఒకటి కాగా, మరొకటి తాజాగా విడుదలైన ‘అనగనగా’ రొమాటింక్ సాంగ్‌, అలాగే రేపు విడుదల అవ్వబోయే ‘పెన్విటీ’ సాంగ్ లో రాయలసీమ తాలూకు నేపధ్యాన్ని, మిగతా పాత్రల ఎస్టాబ్లిష్ చేస్తున్న కారణంగా.. ఈ సాంగ్ లో ఎన్టీఆర్‌ డ్యాన్స్ చెయ్యటానికి స్కోప్ లేదని తెలుస్తోంది.

ఇక మిగిలిన నాలుగో పాట కూడా మెలోడీ సాంగే అని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ డ్యాన్స్‌ చూడాలనుకున్నే, ఆయన అభిమానులకు.. ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంత కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు