
సినిమా మొదలుపెట్టిన నాటినుండీ నేటి వరకూ ఎదో ఒక రికార్డుని తరచూ సృష్టిస్తూ ముందుకు సాగుతుంది బాహుబలి. ఇప్పుడు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4వేలకు పైగా స్క్రీన్ లలో విడుదల చేసి ఇప్పటివరకూ ఏ భారతీయ చలన చిత్రం సాధించలేని రికార్డుని సొంతం చేసుకునే ప్రయత్నంలో వున్నారు.
ఆంధ్రా తెలంగాణా కలిపి దాదాపు 2వేల థియేటర్లలో విడుదల చేయనున్నారు. టాలీవుడ్ లో విడుదలైన పెద్ద సినిమాలు కూడా ఈ నెంబర్ కి దరిదాపుల్లో కూడా లేవు. ఇక్కడేకాక నార్త్ ఇండియాలో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదలచేయనున్నారు.
ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ముఖ్యపాత్రధారులు. కీరవాణి సంగీత దర్శకుడు. ఆర్కా మీడియా సంస్థ నిర్మాత.

