
దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి ది బిగినింగ్’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ జూన్ 1నే విడుదలైన విషయం తెలిసిందే! ముంబైలోని ఓ ఈవెంట్‌లో బాహుబలి టీమ్, హిందీ పంపిణీదారుడు కరణ్ జోహర్‌లు పాల్గొని హిందీ, తెలుగు ట్రైలర్‌లను లాంచ్ చేశారు.
ప్రభాస్, రానాల కళ్ళు తిప్పుకోనివ్వని లుక్స్, రాజమౌళి మార్క్ టేకింగ్, ఎమ్.ఎమ్.కీరవాణి స్టన్నింగ్ మ్యూజిక్, అద్భుతమైన విజువల్స్‌తో బాహుబలి ట్రైలర్ సూపర్బ్ అనిపించుకుంది. ఇక ఈ ట్రైలర్ ఇప్పుడు తమిళ ప్రేక్షకులనూ థియేటర్లలో అలరించేందుకు సిద్ధమవుతోంది. రేపు (జూన్ 5న) చెన్నైలో బాహుబలి సినిమా ట్రైలర్‌ను తమిళంలో డబ్ చేస్తున్న స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు విడుదల చేయనున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

