“బలగం” కి పెరుగుతున్న ఆదరణ.!

Published on Mar 7, 2023 7:22 pm IST


కొన్ని చిత్రాల ఫలితాలు ఎప్పుడూ కూడా మంచి సర్ప్రైజింగ్ గా ఉంటాయి అలాంటి సినిమాల్లో ఒకటిగా గత శుక్రవారం మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి వచ్చిన సినిమా “బలగం” కూడా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి మెయిన్ లీడ్ లో యంగ్ నటి కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా మన టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ టిల్లు వేణు దర్శకత్వం వహించిన భావోద్వేగ పూరిత ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.

మరి ఈ సినిమా అయితే రిలీజ్ రోజు నాటి నుంచి మంచి మౌత్ టాక్ ని తెచ్చుకొని అదిరే హిట్ అయ్యింది. ఇక లేటెస్ట్ గా అయితే వీక్ డే సోమవారం కి వచ్చినప్పటికీ కూడా వీకెండ్ డే శనివారం తో సమానమైన వసూళ్లు ఈ సినిమా రిజిస్టర్ చేసినట్టుగా మేకర్స్ చెప్తున్నారు. మొత్తానికి అయితే మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా మంచి ఆదరణతో లాంగ్ రన్ వైపు వెళ్తుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :