బాలయ్య – బోయపాటి సినిమా లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 24, 2019 8:04 pm IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రం ప్రస్తుతం ప్రై ప్రొడక్షన్ కార్య క్రమాలను జరుపుకుంటుంది. అలాగే ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుందని సమాచారం. మొత్తానికి బోయపాటి మళ్లీ నరకుడు కోసం ఫిబ్రవరిలో పూజా కార్యక్రమం మొదలుపెడుతున్నాడు అన్నమాట.

ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్ లోనే రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆద్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను తీయనున్నాడు. గతంలో బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ , లెజెండ్’ చిత్రాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అవ్వడంతో ఈ కొత్త చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వీరిద్దరికి ఈ చిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

అయితే ఈ చిత్రంలోని చాలా భాగం రాజకీయ నేపథ్యంలో సాగనుందట. రాజకీయాలతో పాటు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి ఎండగట్టే విధంగా మంచి పవర్ ఫుల్ గా ఈ స్క్రిప్ట్ ఉంటుందట. మరి ఈ సినిమా కూడా వీరి నుంచి వచ్చిన గత సినిమాలు లాగే భారీ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More