వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తోన్న బాలయ్య !

Published on Apr 25, 2021 2:00 am IST

‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా స్థిరపడిపోయారు. ‘మాస్ మహారాజా’ రవితేజ ప్లాప్ ల వలయంలో నలిగిపోతూ ఉంటే ‘క్రాక్’తో మంచి సాలిడ్ హిట్ ఇచ్చాడు ‘గోపీచంద్ మ‌లినేని’. అందుకే బాలయ్య పిలిచి మరీ సినిమా ఇచ్చాడు. ఇక గోపీచంద్ మలినేని కూడా బాలయ్య బాబుకు సరిపోయే కథను బాలయ్యకు చెప్పి సినిమాని సెట్ చేసుకున్నాడు.

కాగా ఈ సినిమాని జులైలో స్టార్ట్ప చేసి వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఒక రూమర్ బాగా వినిపిస్తోంది. పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పాడట. కథ బాలయ్యకి నచ్చిందట. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.

అయితే, క్రాక్ లో గోపీచంద్ మలినేని కొన్ని మాస్ సీన్లు తీసిన విధానం బాలయ్యకు చాల బాగా నచ్చిందట. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య తన తర్వాతి సినిమాని ‘క్రాక్’ దర్శకుడితో సాలిడ్ గా ప్లాన్ చేసాడు.

సంబంధిత సమాచారం :