బాలకృష్ణ -బోయపాటి సినిమా లాంచ్ కు డేట్ ఫిక్స్ ?

Published on Mar 7, 2019 8:51 am IST


నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ఇక ఈచిత్రం మార్చి 28న లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే షూటింగ్ మాత్రం ఎన్నికల తరువాతే స్టార్ట్ కానుంది. టీడీపీ తరుపున బాలయ్య ప్రచారం చేయనున్నారు. అందుకే షూటింగ్ ఆసల్యం గా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్ బి కె ఫిలిమ్స్ నిర్మించనుంది. ఇక ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన సింహ , లెజెండ్ భారీ విజయాలు సాధించడంతో ఈ కాంబినేషన్ ఫై భారీ అంచనాలు వున్నాయి.

అయితే ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ తో బాలయ్య , వినయ విధేయ రామ తో బోయపాటి డిజాస్టర్ లను చవి చూశారు. దాంతో ఈ కొత్త చిత్రం తో వీరిద్దరు ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిందే. మరి ఈ చిత్రం తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

More