బాలయ్య పోరాటం వారణాసిలో కాదు లోకల్లోనే !

బాలయ్య పోరాటం వారణాసిలో కాదు లోకల్లోనే !

Published on Dec 16, 2020 1:00 AM IST

BB3

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. చిత్రీకరణ దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే చిత్రీకరణ తిరిగి మొదలైంది. మొదట్లో సినిమాలోని పలు కీలక, యాక్షన్ సన్నివేశాలను వారణాసిలో చిత్రీకరించాలని భావించారు బోయపాటి. లాక్ డౌన్ మూలంగా అది కుదరలేదు.

ఇప్పుడు ఇదే షెడ్యూల్ నంద్యాలలో చేయనున్నారు. నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరపనున్నారు. ఇందులో ఎక్కువగా పోరాట సన్నివేశాలే ఉంటాయట. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తుండగా ప్రధాన ప్రతినాయకుడు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు టీమ్. బోయపాటి ప్రతి సినిమాలోనూ హీరోకు సమానంగా విలన్ పాత్రలు ఉంటాయి. అప్పుడే హీరో పాత్ర బలంగా ఎలివేట్ అవుతుందనేది బోయపాటి సూత్రం. అందుకే బాలయ్యకు సరిసమానమైన స్టేచర్ కలిగిన నటుడి కోసం వెతుకుతున్నారట. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు